Global Vaartha
Date of Publish : 01/11/2026, 10:12 am
Editor : భవ్య జర్నలిస్ట్

వైఎస్‌ జగన్‌పై కూటమి సర్కార్‌ కుట్రలు

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి సర్కార్‌ కుట్రలకు తెరలేపింది. పులివెందులలో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ఆటంకాలు కలిగించింది. నిన్న హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో అధికారులు మాట మార్చారు. మధ్యాహ్నం 2:30 తర్వాతే హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతిస్తామంటూ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ కొత్త ఆదేశాలు జారీ చేశారు.అయితే, అప్పటికే బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో వైఎస్‌ జగన్‌ బయలేర్దారు. వెనక్కి వెళ్లాలని హెలికాఫ్టర్‌ ఆపరేటర్‌కు అధికారులు ఫోన్‌ చేశారు. ఇంధన కొరతతో పులివెందులలో హెలికాఫ్టర్‌ను పైలట్‌.. ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. ఆఖరి నిమిషంలో అనుమతి ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save