Date of Publish : 01/11/2026, 12:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్
సొంత బాబాయ్‌ను చంపించి.. మా జీవితాలు నాశనం చేశావ్: జగన్ ర్యాలీలో దస్తగిరి వ్యాఖ్యలు
- పులివెందులలో వైఎస్ జగన్‌కు షాక్ తగిలింది. పులివెందుల వీధుల్లో జగన్ చేపట్టిన ర్యాలీకి.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ఎదురుగా వెళ్లి అడ్డుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పులివెందుల వీధుల్లో జగన్ చేపట్టిన ర్యాలీలో ఓ ఆకస్మిక సంఘటన చోటుచేసుకుంది. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ర్యాలీకి ఎదురెళ్లాడు.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వీధుల్లో ర్యాలీ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ర్యాలీకి ఎదురెళ్లాడు. గమనించిన వైసీపీ అనుచరులు ‘దస్తగిరి వచ్చాడు. దస్తగిరి వచ్చాడు’ అంటూ జగన్‌కు సమాచారం అందించారు. ఇంతలోనే దస్తగిరి జగన్ ముందుకెళ్లి ‘సొంత బాబాయ్ వివేకాను చంపించి.. మా జీవితాలు నాశనం చేశావ్’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కంగుతిన్న జగన్ నిశ్చేష్టుడయ్యారు. ఇంతలో దస్తగిరి మరింత ముందుకు వచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు నిలువరించి అతడిని పక్కకు పంపారు. ఆపై జగన్.. దస్తగిరిని చూసీ చూడనట్టుగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.