Global Vaartha
Date of Publish : 01/11/2026, 12:28 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అనంతపురంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురం నగరంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నగరంలోని మొత్తం 62 డివిజన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అలజడులకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి 43వ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నగరంలో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, బెదిరింపులు చోటుచేసుకున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు ఈసారి నగరంలో ఎక్కడా కనిపించడం లేదని, ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించామని తెలిపారు. నగరంలోని 62 డివిజన్లలోనూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుండటం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save