Date of Publish : 01/11/2026, 5:11 pm
Editor : భవ్య జర్నలిస్ట్
పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా.
- పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
- మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించిన పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి
పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పలు వార్డుల్లో ఓటింగ్ జరగకుండా ఎంపీ అవినాష్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని బీటెక్ రవి ఆరోపించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ జగన్ ర్యాలీగా బయలుదేరి వచ్చి ధర్నా చేయడం, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలకు పాల్పడటం సరికాదని బీటెక్ రవి తీవ్రంగా విమర్శించారు.
పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.