Global Vaartha
Date of Publish : 01/11/2026, 9:09 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఫలితాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. 11 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ ముగిసినట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. 11 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ ముగిసినట్లు ఆయన తెలిపారు. అయితే, సాయంత్రం 5 గంటల్లోపు బూత్‌లో ఓటు వేసేందుకు క్యూలో ఉన్నవారికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, విజయవాడ 55వ డివిజన్‌లో ఓటింగ్ సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు. రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఇచ్చామని పునేఠా పేర్కొన్నారువిజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్‌పై గుర్తులు తారుమారు కావడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని, అందుకే అదనపు సమయాన్ని కేటాయించినట్లు ఎన్నికల కమిషనర్ పునేఠా చెప్పారు. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ముగిసినందున బ్యాలెట్ బాక్సుల తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల అంశాన్నే ప్రధానంగా భావించి ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించామని చెప్పుకొచ్చారు. కాగా, ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఈనెల 3న (మంగళవారం) వెలువడతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save