Global Vaartha
Date of Publish : 01/11/2026, 9:12 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..

  • ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కాలేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెప్పారని, అందులో సగం మంది కూడా రాలేదని బీజేపీ పేర్కొంది.

 ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కాలేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెప్పారని, అందులో సగం మంది కూడా రాలేదని బీజేపీ పేర్కొంది. సభా ప్రాంగణానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు (INDIA Bloc Rally).ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై నిరసనగా ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇండియా కూటమిలోని పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సభకు 10 లక్షల మందికి పైగా వస్తారని కాంగ్రెస్ నేతలు కే.సి. వేణుగోపాల్, పవన్ ఖేరా వంటి వారు అంచనా వేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీల సంఖ్యను ప్రస్తావిస్తూ సంబిత్ పాత్ర కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 28 వేల కుర్చీల్లో 5 వేల నుంచి 7 వేల వరకు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save