Date of Publish : 01/11/2026, 9:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. టీ20ల్లో భువీ చెత్త రికార్డు..!
- టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ టోర్నీల్లో ఈ సీనియర్ పేసర్ నిలకడైన ప్రదర్శనల ఆధారంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికయ్యాడు
టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్, దేశవాళీ టోర్నీల్లో ఈ సీనియర్ పేసర్ నిలకడైన ప్రదర్శనల ఆధారంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో భువీ తన స్వింగ్ బౌలింగ్ ఎటాక్‌తో కివీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించగలడని టీమిండియా అభిమానులు ఆశించారు. కానీ ఈ రీ ఎంట్రీ కెరీర్లోనే అతడి చేదు అనుభవం ఎదురైంది.ఈ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ 4 మ్యాచ్‌లకు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో వరసగా విఫలం కావడంతో అతడిని నాలుగో టీ20 నుంచి సెలక్టర్లు తొలగించారు. ఇవాళ(ఆదివారం) హామిల్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో తిరిగి ఆడాడు. అయితే వేదిక మారినంత మాత్రాన భువీ రాత మారలేదు. ఈ సిరీస్ ఆసాంతం వికెట్లు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.
ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసిన భువీ కేవలం ఒక వికెట్ సాధించాడు. అలానే కివీస్ బ్యాటర్లు భువీ బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధించారు. ఫలితంగా భువనేశ్వర్ కుమార్ ఎకానమీ రేటు 11.25గా, బౌలింగ్ సగటు 180.00గా నమోదైంది. ఈ అత్యంత నిరాశాజనకమైన ప్రదర్శనతో భువనేశ్వర్ ఈ టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త బౌలింగ్ సగటు కలిగిన రికార్డును మూటగట్టుకున్నాడు.
న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమీసన్ ఐదేళ్ల క్రితం నెలకొల్పిన చెత్త రికార్డును (175.00) తాజాగా భువనేశ్వర్ తన పేరిట లిఖించుకున్నాడు. భువీ ఐపీఎల్ 2025లో 17 వికెట్లు పడగొట్టి, 2026 ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 28 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ జట్టులోకి తిరిగి పిలుపు అందుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. రీఎంట్రీలో భారత స్టార్ స్వింగ్ బౌలర్ ఇలాంటి గణాంకాలను నమోదు చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సిరీస్ వైఫల్యం తర్వాత భువీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.