Global Vaartha
Date of Publish : 02/11/2026, 7:21 am
Editor : భవ్య జర్నలిస్ట్

జిల్లాలోని 8 పోలింగ్ కేంద్రాల్లో నేడు రీపోలింగ్...

  • జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి


* కడపలో -1, జమ్మలమడుగులో -3, పులివెందులలో - 4 పోలింగ్ కేంద్రాల్లో ఉ౹౹ 7 నుంచి సా౹౹ 5 గం. వరకు పోలింగ్
* ఓటర్లు గమనించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
కడప, నవంబర్ 2 : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాలోని కడప నగరపాలక సంస్థ, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం (నవంబర్ 2) రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
కడప నగరపాలక సంస్థలోని 15వ వార్డు పరిధిలో పోలింగ్ కేంద్రం నంబర్ 15/2లో, జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 3వ, 17వ, 29వ వార్డులకు చెందిన 3/2, 17/1, 29/1 పోలింగ్ కేంద్రాల్లో, పులివెందుల మున్సిపాలిటీలోని 1, 3, 7, 8వ వార్డులకు చెందిన 1/1, 3/1, 7/1, 8/1 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.
ఈ కేంద్రాల్లో నవంబర్ 1వ తేదీన జరిగిన పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తూ, నవంబర్ 2వ తేదీన తాజాగా పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.
సూచించిన ఆయా పోలింగ్ కేంద్రాల్లో.. రీపోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలోని పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save