Global Vaartha
Date of Publish : 02/11/2026, 10:00 am
Editor : భవ్య జర్నలిస్ట్

భానుడి నునులేత కిరణాల వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..

పొద్దున్నే ఉదయించే సూర్యుడి నునులేత కిరణాలను మీలో ఎంతమంది ఆస్వాదిస్తున్నారు. దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా.. పదండి తెలుసుకుందాం..మనిషి ప్రకృతికి దూరం అవుతూ.. అనారోగ్యానికి, మానసిక ఒత్తిళ్లకు దగ్గరవుతున్నాడు. దీనికి చిన్న ఉదాహరణ.. ప్రకృతి మనకు ఫ్రీగా ఇస్తున్న ఆరోగ్యాన్ని కాదని.. హాస్పిటల్స్‌లో డబ్బులు వెచ్చించి మందులు, థెరపీల రూపంలో కొనుక్కుంటున్నాం. ఉదయం కాసేపు ఎండలో గడపడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో చూద్దాం..

1. విటమిన్ ‘డి’ లోపాన్ని భర్తీ చేస్తుంది

మారుతున్న జీవన విధానం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సూర్యుడు ఉదయించక ముందే ఆఫీసులకు వెళ్లడం, రాత్రి ఇంటికి రావడం, సూర్యుడి వెలుతురు కూడా సోకని సెంట్రల్ ఏసీ గదుల్లో రోజంతా పనిచేయడం.. ఇక శరీరానికి సూర్యరశ్మి ఎలా తగులుతుంది.మనలో ఎక్కువ శాతం మందికి విటమిన్ ‘డి’ లోపం ఉందంటే మీలో ఎంతమంది నమ్ముతారు. దీని కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి.. వాళ్లు ఇచ్చిన మందు బిళ్లలను రోజూ తింటూ ఉంటాం. కానీ.. ఉదయం సూర్యుడి ఎండలో ఒక 20 నిమిషాలు గడపడం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ‘డి’ పుష్కలంగా లభిస్తుంది. శరీరం స్వయంగా విటమిన్‘డి’ ని తయారు చేసుకుంటుంది. ఈ విటమిన్ ఎముకలను, దంతాలను దృఢంగా చేస్తుంది.

2.మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుంది.

ఎండకు, మానసిక ఒత్తిళ్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ఎండలో కాసేపు గడపడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఉదయపు ఎండ వల్ల శరీరంలో చాలా హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి శరీర మూడ్స్‌ను మెరుగుపరుస్తాయి. రోజంతా చాలా ఎనెర్జిటిక్‌గా పనిచేయడంలో మనకు ఈ హార్మోన్స్ దోహదపడతాయి. ప్రకృతే అసలైన థెరపీ.. ప్రకృతిలో కాసేపు గడపడం.. సూర్యుడి ఎండను ఆస్వాదించడం ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఫాలో అయితే.. సగం ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

3. నిద్రలేమిని దూరం చేస్తుంది

ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. పని ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ తగ్గడం.. లాంటి కారణాల ప్రభావం వల్ల.. సరిపడా నిద్ర ఉండదు. రోజులో ఉదయం ఓ గంట పాటు ఎండలో గడపడం వల్ల శరీరంలో ‘సెరటోనిన్’ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ నిద్రను ప్రేరేపించే ‘మెలటోనిన్’ హార్మోన్‌గా మారి శరీరంలో తగినంత నిద్రను ప్రేరేపిస్తుంది.

4. గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు

ఉదయం కాసేపు ఎండలో గడపడం వల్ల.. రక్తనాళాల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్తేజమవుతుంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి.. రక్తం సాఫీగా ప్రసరించడానికి దోహదపడుతుంది. ఫలితంగా రక్తపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుండె జబ్బులను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save