Global Vaartha
Date of Publish : 02/11/2026, 10:39 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్

అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7.00 గంటలకు ఈ రీపోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5.00 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అనంతపురం కార్పొరేషన్‌లో 30/3, తిరుపతి కార్పొరేషన్‌లో 36/4, కడప కార్పొరేషన్‌లో 15/2, మాచర్ల 23వ వార్డులోని 1, 2.., ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 14/1లో, జమ్మలమడుగు 3/2, 17/1, 29/1, పులివెందుల 1, 3, 7, 8 వార్డుల్లోని 1 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తుంది.ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరిగాయి. కొన్ని ఏకగ్రీవం కావడంతో.. 13 కార్పొరేషన్లతోపాటు 79 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలు పోలింగ్‌ బూత్‌లలో ఆక్రమాలపై ఎస్ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది.

వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లలో పలు అక్రమాలు జరిగినట్లు ఎస్ఈసీకి జిల్లా కలెక్టర్లు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఎస్‌ఈసీ ఆదేశించింది. దీంతో సోమవారం ఆయా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save