Global Vaartha
Date of Publish : 02/11/2026, 12:55 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ముంచుకొస్తున్న మురసు తుఫాన్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు

అమరావతి : మురసు తుఫాన్ ముంచుకొస్తుంది. నేటి సాయంత్రం నెల్లూరు - ఒంగోలు మధ్య ఈ తుఫాన్ తీరం దాటనుంది. దీంతో కృష్ణా, పెన్నా బేసిన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్టీజీఎస్ (RTGS) నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అలాగే వివిధ శాఖల మంత్రులు.. ఆయా శాఖల ఉన్నతాధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి గొట్టిపాటి

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలు తెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఫ్లడ్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు: మంత్రి నిమ్మల

రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను ప్రతి రెండు గంటలకూ ఒకసారి గమనించాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ శాఖల సమన్వయంతో ఫ్లడ్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాగులు, వంకల వద్ద జన సంచారాన్ని నిలిపివేయాలని సూచించారు. తుఫాన్ వేళ.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు..

సీఆర్డీఏ (CRDA) సర్కిల్: 8331092947

చిలకలూరిపేట: 9491052943

మంగళగిరి: 6281703602

పల్నాడు సర్కిల్: 7661019447

మాచర్ల: 9440817531

నరసరావుపేట: 9440817539

మార్కాపురం సర్కిల్: 7780420711

కనిగిరి: 9440812364

మార్కాపురం: 9440817509

గిద్దలూరు: 8247722971

ఎన్టీఆర్ సర్కిల్: 9440817561

విజయవాడ రూరల్: 7382623229

విజయవాడ టౌన్: 7382623226

నూజివీడు: 7382623224

గుణదల: 9491052947

ప్రకాశం సర్కిల్: 9440817491

ఒంగోలు: 9440817495

అద్దంకి: 9490611613

దర్శి: 9491065264

కందుకూరు: 9491052950

బాపట్ల సర్కిల్: 9281413774

బాపట్ల: 9491052945

చీరాల: 9440817597

గుంటూరు సర్కిల్: 9440817526

గుంటూరు: 9440817527

తెనాలి: 9440817535

కృష్ణా సర్కిల్: 6281709355

మచిలీపట్నం: 8672222294

ఉయ్యూరు: 7382623231

గుడివాడ: 9440817573

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save