అమరావతి : రాష్ట్రంలో మురుసు నేపథ్యంలో జలవనరుల అభివృద్ధి శాఖామంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు తగు సూచనలు అందజేశారు.సాగర్ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ క్రమంలో గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద వచ్చే అవకాశాలున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను గమనించాలని సూచించారు. ఇతర శాఖలతో సమన్వయం అవుతూ.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.