అనంతపురం, నవంబర్ 2: రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఈ వార్త తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పుకొచ్చారు. బాలిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
లోకేశ్ పోస్ట్..
‘ఈ రోజు ఉదయాన్నే బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు.. ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త చెప్పారు. అందించారు. రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. వైద్యుల సూచనలను అర్థం చేసుకుని స్పందిస్తోంది. బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వార్త నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది నాకే కాదు, ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే శుభవార్త. బాలిక త్వరగా పూర్తిగా కోలుకుని, చిరునవ్వులతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.