Global Vaartha
Date of Publish : 02/11/2026, 1:05 pm
Editor : భవ్య జర్నలిస్ట్

చైనా డిక్టేటర్‌పై జోక్ ఎఫెక్ట్.. ఎంబాపెకు షాకిచ్చిన కంపెనీలు!

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాపె చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వివాదానికి దారితీసింది. చైనా మాజీ అధ్యక్షుడు మావో జెడాంగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చైనాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంబాపె క్షమాపణలు చెప్పినప్పటికీ చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలివిజన్ ఛానల్ సీసీటీవీ (CCTV) లా లిగా మ్యాచ్‌ల ప్రసారాలను నిలిపివేసింది. ఆదివారం జరిగిన రియల్ మాడ్రిడ్ మ్యాచ్‌ను కూడా ప్రసారం చేయలేదు. చివరకు ఎంబాపెను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగిస్తూ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

అసలేం జరిగిందంటే?

ఫ్రెంచ్ టాక్ షోలో పాల్గొన్న ఎంబాపె పాల్గొన్నాడు. అతడికి ‘మీకు ఇష్టమైన మీమ్ ఏంటి?’ అని వ్యాఖ్యాత అడిగారు. దానికి సమాధానం ఇస్తూ చైనాకు చెందిన మావోను పరోక్షంగా ప్రస్తావించాడు. ‘ఆయన చైనాకు చెందిన డిక్టేటర్ అనుకుంటా’ అని నవ్వుతూ చెప్పాడు. ఈ చిన్న క్లిప్ చైనాలో విపరీతంగా వైరల్ అయింది. దీనికి స్పందించిన ఎంబాపె.. ఆ మరుసటి రోజే క్షమాపణలు చెప్పాడు. ‘నా వ్యాఖ్య సరైనది కాదు. చైనాలోని ప్రజలను నా మాటలు బాధించాయని ఇప్పుడు అర్థం చేసుకున్నాను’ అంటూ వివరణ ఇచ్చాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్, లా లిగా కూడా క్షమాపణలు తెలిపాయి. అయితే అదే రోజు చైనాకు చెందిన డాంగ్‌పెంగ్, మెంగిన్యూ, మిల్క్‌గ్రౌండ్ తదితర కంపెనీలు ఎంబాపెతో భాగస్వామ్యాలను తెంచుకున్నాయి. జాతీయ సెంటిమెంట్‌ను గౌరవించని వారితో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save