Global Vaartha
Date of Publish : 02/11/2026, 1:25 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. హైటెన్షన్ తీగలకు యంత్రం తగిలి 8 మంది కార్మికుల మృతి

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఝున్‌ఝున్ జిల్లాలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో విద్యుదాఘాతానికి గురై ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. కంకర కలిపే యంత్రం పై భాగం.. హై టెన్షన్ విద్యుత్ తీగలకు తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం.. రాష్ట్రంలోని ఝున్‌ఝున్ జిల్లాలోని ఛపోలి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాగా.. కంకర కలిపే యంత్రం పై భాగం.. అక్కడున్న హై టెన్షన్ విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగిలింది. దీంతో విద్యుత్.. యంత్రం గుండా ప్రవహించడంతో.. దాని సమీపంలో పనిచేస్తున్న 8 మంది కార్మికులు విద్యుత్ షాక్‌కు గురై.. అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉదయ్‌పూర్వతి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save