సంగారెడ్డి జిల్లా : గ్రామీణ విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలన్నదే తన లక్ష్యమని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న లక్ష్మి.. నిరుపేదల విద్యా ప్రమాణాలు పెంచేందుకు తన ట్రస్ట్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న మంచు లక్ష్మి.. చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాలలో 'టీచ్ ఫర్ చేంజ్' ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్మించిన డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్‌ను ప్రారంభించారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు తన ట్రస్ట్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యను అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతో కూడిన విద్యను అందించడానికి.. స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.