Global Vaartha
Date of Publish : 02/11/2026, 2:06 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాప్తాడు నిందితుడికి హెల్త్ అప్డేట్.. కుడికాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్న వైద్యులు

అనంతపురం : రాప్తాడు ఘటనలో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉన్మాది హేమంత్ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి వివరాలు వెల్లడించారు. నిందితుడు హేమంత్ కుడి కాలుకు తీవ్ర గాయం కావడంతో సగం కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్నారు. కుడి కాలుకు రక్త సరఫరా తగ్గిందని తెలిపారు. రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందో ఆపరేషన్ థియేటర్లోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. రక్త సరఫరా బాగుంటేనే నరాలు, కండరాలు బాగుంటాయని.. రక్త సరఫరా లేకుంటే కండరాలు చెడిపోతాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి వెల్లడించారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save