Global Vaartha
Date of Publish : 02/11/2026, 2:20 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భారత నౌకాదళానికి 8 అత్యాధునిక యుద్ధనౌకలు.. రూ.53,866 కోట్లతో ఒప్పందం

ఇంటర్నెట్ డెస్క్: భారత నౌకా దళాన్ని పటిష్ఠం చేసే విధంగా కొత్తతరం యుద్ధ నౌకల తయారీకి రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వివరాల్లోకి వెళితే..ఈ ఒప్పందంలో భాగంగా.. జీఆర్‌ఎస్‌ఈకి (GRSE) 5 కార్వెట్‌లు.. గోవా షిప్‌యార్డ్‌కు (GSL) 3 యుద్ధనౌకల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా షిప్‌యార్డుల్లో 72 లక్షలు, ఎంఎస్ఎంఈలలో 4.6 కోట్ల మేరకు ఉపాధి లభిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. ఈ 8 కార్వెట్లను.. ఆకాశం, సముద్ర ఉపరితలం, నీటి అడుగున.. ఒకేసారి దాడి చేసే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపుదించనున్నట్లు వెల్లడించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా స్వదేశీ డిజైన్, టెక్నాలజీతో యుద్ధనౌకల నిర్మాణం చేపట్టనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save