హిమాచల్ప్రదేశ్ ఫ్యామిలీ కోర్టు తీర్పు
ధర్మశాల : భార్యాభర్తల వివాహ బంధంపై హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా దెహరా ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ఖరీదైన దుస్తులు,
మేకప్ వస్తువులు కావలని భర్తపై ఒత్తిడి చేడయం,
వాటిని తీరనప్పుడు అతడితోపాటు కుటుంబ సభ్యులను దూషించడం,
దాడి చేయడం,
అవమానించడం క్రూరత్వం కిందకు వస్తాయని పేర్కొంది.
ఈ మేరకు భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించింది.
క్రూరత్వం, పరిత్యాగం అనే రెండు కారణాల ఆధారంగా వివాహాన్ని రద్దు చేస్తూ గత అక్టోబర్ నెల 30న అదనపు ప్రిన్సిపల్ జడ్జి సప్నా పాండే తీర్పు వెలువరించారు.
స్థానిక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం కేసు వివరాలు ఇలా వున్నాయి.
మనీశ్ కుమార్, కుంతీ దేవికి 2019 సెప్టెంబర్ 19న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమైంది.
వీరికి ఒక కుమార్తె ఉంది.
ఆమె ప్రస్తుతం తన తల్లి దగ్గర ఉంటోంది.
అయితే తన భార్య ప్రవర్తన కారణంగా దాంపత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని,
ఇక కలిసి జీవించే పరిస్థితి లేదని అంటూ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.
పెళ్లయిన సుమారు రెండు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు భర్త తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
తన ఆర్థిక స్థోమతకు అనుగుణంగా భార్యకు అవసరమైన వస్తువులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ,
ఆమె మాత్రం ఖరీదైన దుస్తులు,
మేకప్ సామగ్రి వెంటనే కొనివ్వాలని పట్టుబట్టేదని ఆరోపించాడు.
ఆ డిమాండ్లు తీర్చలేకపోతే తనను దూషించడంతో పాటు గొడవలకు దిగేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
తనపై పలుమార్లు భౌతిక దాడులకు పాల్పడిందని కూడా ఆరోపించాడు.
భార్య ప్రవర్తన వల్ల తాను,
తన కుటుంబ సభ్యులు మానసిక వేదనకు,
అవమానానికి గురయ్యామని కోర్టుకు తెలిపాడు.
ఈ పిటిషన్ను మనీశ్ కుమార్ 2024 ఫిబ్రవరి 20న దాఖలు చేశాడు.
భర్త సమర్పించిన వాటిని ఖండిస్తూ భార్య తరఫున ఎలాంటి వాదనలు, ఆధారాలు సమర్పించలేదు.
దీంతో 2024 ఆగస్టు 6న కోర్టు ఏకపక్ష విచారణ చేపట్టింది.
భర్త సమర్పించిన ఆధారాలు క్రూరత్వం, పరిత్యాగం రెండింటినీ నిరూపించేందుకు సరిపోతాయని కోర్టు పేర్కొంది.
భార్య ప్రవర్తనతో దాంపత్య బంధం తీవ్రంగా దెబ్బతిన్నదని,
2020 ఆగస్టు నుంచి విడిగా ఉంటున్న దంపతులు తిరిగి కలిసి జీవించే పరిస్థితులు కనిపించడం లేదని అభిప్రాయపడింది.
ఈ క్రమంలో మనీశ్ కుమార్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.