Global Vaartha
Date of Publish : 02/11/2026, 3:29 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాప్తాడు బాలికకు వైఎస్ జగన్ పరామర్శ

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో ఛికిత్స పొందుతున్న బాలికను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.ఈ క్రమంలోనే డాక్టర్లతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైఎస్‌ జగన్‌ తెలుసుకున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారికి ఆయన ధైర్యం చెప్పారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save