Global Vaartha
Date of Publish : 02/11/2026, 3:32 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కర్నూలు జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం

కర్నూలు: జిల్లాలో టీడీపీ గూండాల దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి భయంతో పచ్చమూకలు దాడులతో చెలరేగిపోతున్నారు. ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై రాళ్లు, వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. కర్నూలు మండలం తొలిసావపురం వైఎస్సార్‌సీపీ ఎంపిటీసీ అభ్యర్థి బోయ సరస్వతమ్మపై దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో సరస్వతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు గాయపడ్డారు. టీడీపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి అనుచరులు బరితెగించి దాడులు చేశారని బాధితులు తెలిపారు.కాగా, సంకేసులలోని ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయొద్దంటూ పచ్చమూకలు దాడికి దిగారు. నిన్న(ఆదివారం) మున్సిపల్‌ పోలింగ్‌లో పచ్చ పార్టీ అక్రమాలకు తెగబడింది. బరితెగించి రిగ్గింగ్, సైక్లింగ్‌కు పాల్పడి ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల పచ్చమూకలు పోలీసులతో కలసి ఓటర్లను ఓట్లు వేసుకోనివ్వలేదు.

కొన్ని బూత్‌ల్లో వెబ్‌ కెమెరాల సాక్షిగా మహిళల ఓట్లు పురుషులు వేయడం గమనార్హం. కొన్ని మున్సిపాలిటీల్లో పచ్చమూకలు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలీసులే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపి పచ్చ పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్లు వేయించారు. మొత్తంగా ఆదివారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడింది. ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు, నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనూ పలు వార్డుల్లో పచ్చ నేతలు దొంగ ఓట్లు వేశారు. కొన్ని చోట్ల రిగ్గింగ్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save