Global Vaartha
Date of Publish : 02/11/2026, 4:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు రూ.150 కోట్ల నిధుల మంజూరు

హైదరాబాద్ : నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 కోసం రూ.150 కోట్ల నిధులు విడుదల చేసింది. రుణం రూపంలో నిధుల విడుదలకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2026-27 బడ్జెట్‌లో మెట్రోకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో తొలి విడతగా రూ.125 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెం.990 జారీ చేసింది. అలాగే ప్రతి నెలా నిధుల వినియోగంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save