Global Vaartha
Date of Publish : 02/11/2026, 5:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పులివెందుల ప్రజల స్వేచ్ఛ, స్వచ్ఛతను ఓర్వలేని జగన్

జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే

పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి

పులివెందుల కదిలించే వార్త నవంబర్ 2

పులివెందుల ప్రజలు స్వేచ్ఛ మరియు స్వచ్ఛందంగా ఓట్లు వేసే పరిస్థితి రావడానికి ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి విమర్శలని పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. పులివెందుల పురపాలక ఎన్నికల సందర్భంగా వస్తున్న విమర్శలపై ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ పులివెందులలో ప్రశాంతంగా పోలింగ్ జరిగితే ఎదురుదెబ్బ తప్పదనే భయంతోనే వైఎస్ జగన్ డ్రామాలాడుతున్నారని జగన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయడానికి వచ్చి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారని, పులివెందులలో టిడిపి శ్రేణులు నామినేషన్ వేయడాన్నే నేటికి వారు జీర్ణించుకోలేకపోతున్నారని వాటి కనుగుణంగానే నామినేషన్ల రోజు మంది మార్బలంతో పోలీసులపై దాడి అదేవిధంగా నేడు ఏజెంట్లను అడ్డుకున్నారంటూ ఆవేదన చెందుతున్నారని వైకాపా శ్రేణులు చేసిన అలజడిలో తెదేపా శ్రేణులు గాయపడ్డారని, ఉలిమెల్ల సమీపంలో వారి వాహనాలను వైకాపా శ్రేణులు ధ్వంసం చేసి నిందలు తెదేపాపై మోపుతున్నారని మొత్తం మీద పులివెందులలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా ఇష్టం లేదని దానికి అనుగుణంగానే ఆయన లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save