పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో రీపోలింగ్ జరపాలంటూ జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందులలో తెలుగుదేశం నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని ఎలాంటి చేశారు అనేక అరాచకాలు చేశారని వాటిలో భాగంగానే వైకాపా పార్టీ పోలింగ్ ఏజెంట్లను కనీసం ఎన్నికల బూత్ వరకు రానివ్వకుండా పోలీసులు అడ్డం అలజడి సృష్టించారని, ప్రజలు గమనించారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలని 4రోజుల క్రితమే దాఖలు చేయగా దానికి అనుబంధంగా ఇవాళ మరో పిటిషన్ దాఖలు చేస్తూ వైసీపీ అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు, బూత్ ఏజెంట్లకు రక్షణకి విన్నవిస్తూ నిన్నటి పరిణామాలు, ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు.