Global Vaartha
Date of Publish : 02/11/2026, 5:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పరిగి గార్మెంట్స్ పరిశ్రమల్లో మహిళా ఉద్యోగులతో మంత్రి సవితమ్మ ముఖాముఖి

  • మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి: మంత్రి సవిత

 పరిగి :: మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవితమ్మ పేర్కొన్నారు.

పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండల కేంద్రంలో ఉన్న టెక్పోర్ట్ ఓవెర్సెస్ Pvt. Ltd. (Nisha Designs), ఇండియన్1 డిజైన్స్ ఎక్స్పోర్టు Pvt. Ltd. గార్మెంట్స్ పరిశ్రమలను మంత్రి సవితమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను కలిసి వారి యోగక్షేమాలు, పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహిళల జీవితాల్లో మరింత వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి మద్దతు తెలపాలని మహిళా ఉద్యోగులకు మంత్రి సవితమ్మ విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save