Date of Publish : 02/11/2026, 6:12 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఐపీఎల్ 2027 వేలంలోకి పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్?
- పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ ఐపీఎల్లో ఆడేందుకు తనకు ఆసక్తి ఉందని ఎప్పట్నుంచో చెబుతున్నాడు. అయితే, అతడు పాక్‌కు చెందినవాడు కావడంతో ఐపీఎల్లో ఆడేందుకు అవకాశం లేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్‌గా ఐపీఎల్‌కు పేరుంది. ఈ టోర్నీలో ఆడేందుకు ఎంతో మంది దేశ, విదేశీయప్లేయర్లు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్‌కు కూడా ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి ఉందంట. ఈ విషయాన్ని ఎప్పట్నుంచో అతడు చెబుతున్నాడు. అయితే, ఆమిర్ పాక్‌కు చెందినవాడు కావడంతో ఐపీఎల్లో ఆడేందుకు అవకాశం లేదు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐపీఎల్ 2027 వేలంలో తన పేరును నమోదు చేసుకొనేందుకు మహ్మద్ ఆమిర్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 15,16 తేదీల్లో గోవా వేదికగా ఈ వేలం జరగనుంది సమాచారం. నవంబర్ 15లోగా అన్నీ ఫ్రాంచైజీలు తమ రిటైన్ జాబితాను వెల్లడించాల్సి ఉంది. ఆ తర్వాత ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకుంటారు. రేపటి(మంగళవారం) నుంచి జరగనున్న అఫ్గానిస్థాన్ ప్రిమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో (APL) మహ్మద్ ఆమిర్ పేరు ఉంది.
అయితే, అతడు పాకిస్థాన్ నుంచి కాకుండా.. ఇంగ్లండ్ పౌరుడిగా పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. ఒకవేళ ఏపీఎల్‌లో అతడి ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం.. ఐపీఎల్‌లోనూ (IPL) యూకే పౌరుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు మరింత గట్టిగా ప్రయత్నిస్తాడని టాక్. బీసీసీఐ అందుకు అనుమతి ఇస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆమిర్ పాక్ సంతతి ప్లేయర్ కాబట్టి.. అతడి విషయంలో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినా ఆశ్చర్యం లేదు. 34 ఏళ్ల ఆమిర్ పాకిస్థాన్ తరఫున 159 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. యూకే పౌరురాలు, న్యాయవాది నర్జిస్ ఖాన్‌ను ఆమిర్ వివాహం చేసుకోవడం ద్వారా ఆ దేశ పౌరసత్వం సంపాదించాడు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.