Global Vaartha
Date of Publish : 02/11/2026, 9:04 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అధ్యయనానికి శ్రీ సత్యసాయి జిల్లాకు విచ్చేసిన ఐర్లాండ్ ప్రముఖ చెఫ్ డారినా

ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యం, పోషకాహార విలువలు, రైతుల అనుభవాలను తెలుసుకున్న అంతర్జాతీయ ఐర్లాండ్‌కు చెందిన ఖ్యాతిగాంచిన ప్రముఖ చెఫ్, వంటకళలో విశేష నైపుణ్యం కలిగిన డారినా అలెన్ గారు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వివిధ రకాల కూరగాయల సాగు, ప్రకృతి వ్యవసాయ పంటల నాణ్యత మరియు పోషక విలువలను అధ్యయనం చేసేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు.
CT & IO, DPM లక్ష్మా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మడకశిర డివిజన్‌లోని పలు గ్రామాలను సందర్శించి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. మొదట జవనడకులో ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల ఇంపుట్స్ , ఘన & ద్రావ జీవామృతం తయారీ విధానాలను పరిశీలించారు. అనంతరం రైతు శివమ్మ గారు మామిడి తోటలో చేపట్టిన ఏటీఎం నమూనా, పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ విధానాన్ని సందర్శించి పంటల సాగు తీరును తెలుసుకున్నారు. రెండు ఎకరాల్లో చేపట్టిన వక్క (అరెకానట్) తోటలోని పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ నమూనాను కూడా పరిశీలించారు.
అనంతరం బొజ్జన్న గారు అర ఎకరంలో చేపట్టిన మునగ ఆధారిత కూరగాయల సాగు నమూనాను, మొరపురగుండు గ్రామంలో లలిత గారు ఒక ఎకరంలో సాగు చేస్తున్న వివిధ రకాల కూరగాయల నమూనాను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయం ద్వారా వారి కుటుంబాల ఆహార భద్రత, ఆదాయం, జీవన విధానంలో వస్తున్న మార్పుల గురించి తెలుసుకున్నారు.
తదుపరి రూప గారు బీడు భూమిలో ఒక ఎకరంలో అమలు చేస్తున్న పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం బుదిపల్లె గ్రామంలోని జమాలబండలో మల్బరీ తోటలో అమలు చేస్తున్న పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ నమూనాను, మంజుల గారు రెండు ఎకరాల్లో చేపట్టిన ఏ-గ్రేడ్ కూరగాయల సాగు నమూనాను సందర్శించారు.
ఈ క్షేత్రస్థాయి పర్యటనలో RySS SPM డాక్టర్ నవీన్ గారు, MT రమేష్ గారు ప్రతి నమూనాలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ సూత్రాలు, విత్తనాల ఎంపిక, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, సహజ ఇన్‌పుట్ల వినియోగం, పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ విధానం వంటి అంశాలను వివరించారు. ఈ పర్యటనలో Ryss సిబంది రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో RySS సిబ్బంది, రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save