Global Vaartha
Date of Publish : 02/11/2026, 9:05 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ధర్మవరం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.. డి.ఎస్.పి...

  • కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా చర్యలపై అధికారుల పరిశీలన...

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రేపు (03-11-2026) ధర్మవరం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు బి.ఎస్.ఆర్. బాయ్స్ హైస్కూల్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను ధర్మవరం సబ్ డివిజన్ డీఎస్పీ బి.వి జగన్నాథ రాజు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ధర్మవరం వన్ టౌన్ సీఐ రెడ్డప్ప లు పరిశీలించారు.
కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
కౌంటింగ్‌కు సంబంధించిన అధికారిక సమాచారం మాత్రమే ప్రచురించాలని, ధృవీకరించని లేదా సంబంధంలేని సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించవద్దని డి.ఎస్.పి సూచించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గారు హెచ్చరించారు.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save