Date of Publish : 02/11/2026, 9:09 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి
- ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఈడీ కస్టడీకి తీసుకుంది.
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఈడీ కస్టడీకి తీసుకుంది. రెండు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో రిమాండ్లో ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ను ఏపీ నుంచి హైదరాబాద్కు అధికారులు తరలించారు. అతణ్ని నాంపల్లి కోర్టులో ఈడీ హాజరుపరిచింది.కాగా లిక్కర్ స్కామ్లో ఈశ్వర్ కిరణ్ కుమార్ కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కుంభకోణంలో దోచుకున్న రూ.వేల కోట్లను అతడు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి ఈశ్వర్ అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించేవాడు. గతంలో ఏపీ సిట్ కూడా ఈశ్వర్ కిరణ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.