Date of Publish : 02/11/2026, 9:10 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఆ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై వచ్చే ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించిన ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి కాలపరిమితులు విధించింది.
అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై వచ్చే ఫ్రీహోల్డ్ దరఖాస్తుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించిన ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి కాలపరిమితులు విధించింది. ఆర్డీవో పరిధిలో దరఖాస్తులకు 60 రోజుల్లో పరిష్కారం చూపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిర్దిష్ట కేటగిరీ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని నిర్దేశించింది. అలాగే తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి 60 రోజుల సమయం తీసుకొవచ్చని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 659 జారీ చేసింది.కాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన రోజే తహసీల్దార్ లాగిన్‌కు చేరేలా ప్రభుత్వం సాంకేతిక మార్పులు తీసుకొచ్చింది. వెబ్‌ల్యాండ్‌లో ఫ్రీహోల్డ్ నమోదైన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని చెప్పింది. ఇందుకోసం ఫ్రీహోల్డ్ ప్రొసీడింగ్స్ సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. వెబ్‌ల్యాండ్ వివరాలు రికార్డుల్లో భద్రపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.