Date of Publish : 02/11/2026, 9:12 pm
Editor : భవ్య జర్నలిస్ట్
బలపడుతున్న మురసు తుఫాన్.. గంటకు 13 కిమీ వేగంతో..
- బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుఫాన్‌గా బలపడుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుఫాన్‌గా బలపడుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. గడచిన 6 గంటల్లో ఇది గంటకు 13 కిమీ వేగంతో కదులుతోందని తెలిపింది. ఈ తుఫాన్ ప్రస్తుతం కావలికి 70 కిమీ, నెల్లూరుకు 80 కిమీ, ఒంగోలుకు 90 కిమీ, బాపట్లకు 120కిమీ, తిరుపతికి 170కిమీ, మచిలీపట్నానికి 170కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరిచింది. ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో ‘మురసు’ తీరాన్ని దాటే అవకాముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీఎస్‌డీఎమ్ఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.ముందస్తు సహాయ చర్యలకు నిధులు విడుదల
‘మురసు’ తుఫాన్ ముంచుకొస్తున్న వేళ ముందస్తు సహాయ చర్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 17 జిల్లాలకు మొత్తం రూ.37 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఏలూరు, ఎన్టీఆర్, తూ.గో., ప.గో., పల్నాడు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులిచ్చింది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.