Global Vaartha
Date of Publish : 02/11/2026, 9:13 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌‌ సిగ్నల్

  • ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.1475 కోట్లతో సచివాలయ టవర్లను నిర్మించనున్నారు. సచివాలయం టవర్లు 1, 2లో కీలక మౌలిక సదుపాయాల పనులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.1475 కోట్లతో సచివాలయ టవర్లను నిర్మించనున్నారు. సెక్రటేరియెట్ టవర్లు 1, 2లో కీలక మౌలిక సదుపాయాల పనులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో ఎంఈపీ పనులకు టెండర్ ఖరారు చేశారు. రూ.768.89 కోట్లతో షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ఈ పనులు చేపట్టనుంది. ఎలక్ట్రికల్, ఏసీ, ఫైర్ సేఫ్టీ, లిఫ్టులు, ప్లంబింగ్ పనులను షాపూర్ జీ పల్లోంజీ సంస్థ చేపట్టనుంది. అలాగే సచివాలయం, హెచ్ఓడీ ఆఫీసు టవర్లు 3, 4లో హైసైడ్ ఎంఈపీ పనులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.708.12 కోట్ల విలువైన ఈ పనులను ఎల్అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save