Global Vaartha
Date of Publish : 02/11/2026, 9:19 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ! వైభ‌వ్‌కు చోటు

దోహా వేదికగా జరగనున్న ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్‌, హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా రజత్ పాటిదార్ వ్యవహరించనున్నాడు.
ఈ జట్టులో సీనియర్ జట్టు ప్లేయర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గేలకు చోటు దక్కింది. అదేవిధంగా . గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా కూడా ఈ జట్టులో ఉన్నాడు. వీరితో పాటు షాబాజ్ అహ్మద్, హర్ష్ దూబే, తనుష్ కోటియాన్, విప్రాజ్ నిగమ్, అర్షద్ ఖాన్‌లకు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు.
వికెట్ కీపర్లగా ప్రభుసిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్రలు ఎంపికయ్యారు. అయితే ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల చాలా మంది ఆటగాళ్లు తమ తమ రాష్ట్రాల తరఫున జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోని కీలక మ్యాచ్‌లకు దూరం కానున్నారు.
టీమిండియా షెడ్యూల్‌
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభించారు. ఇండియా-ఎ జట్టు గ్రూప్-బిలో యుఏఈ, నేపాల్, పాకిస్తాన్-ఎ జట్లతో కలిసి ఉంది. గ్రూప్-ఏలో బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ, ఆఫ్ఘనిస్తాన్-ఎ, హాంకాంగ్ జట్లు ఉన్నాయి.
ఇండియా-ఎ తమ తొలి మ్యాచ్‌లో వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నవంబర్ 20న నేపాల్‌తో తలపడనుంది. నవంబర్ 22న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. భారత్ చివరి గ్రూపు మ్యాచ్‌లో నవంబర్ 24న యూఏఈతో తలపడనుంది.
ఇండియా-ఎ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్‌ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభుసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), రింకూ సింగ్, సుర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కోటియాన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save