Global Vaartha
Date of Publish : 03/11/2026, 10:02 am
Editor : భవ్య జర్నలిస్ట్

మురసు తుఫాన్ నష్టంపై అమిత్ షా ఫోన్.. కేంద్ర సాయం కోరిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో మురసు తుఫాన్‌ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై మాట్లాడారు. ఆర్నబ్ తుఫాను ప్రభావం... ఆ వెంటనే మురసు తుఫాన్ రావడంపై పరిస్థితులను అమిత్ షాకు సీఎం వివరించారు. వివిధ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టం గురించి కేంద్ర మంత్రికి తెలియజేశారు. కేంద్ర బృందాన్ని పరిశీలనకు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. వరుస తుఫాన్ల నేపథ్యంలో తగు సాయంతో ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని సీఎం చంద్రబాబు కోరారు.

ఇక.. మురసు తుఫాను ఒంగోలు దక్షిణంగా తీరం దాటడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరగగా, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షితప్రాంతాలకు తరలించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save