Global Vaartha
Date of Publish : 03/11/2026, 10:44 am
Editor : భవ్య జర్నలిస్ట్

మద్యం కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణ

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మద్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో నోటీసులు ఇవ్వగా తన ఆరోగ్యం బాగోలేదంటూ అంబటి రాంబాబు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఆ తరువాత తనకు గుండెకు స్టంట్‌లు వేయడంతో ఆ ఆసుపత్రి ఇచ్చిన నివేదికను ఈడీ అధికారులకు పంపించారు.

గత నెల 29వ తేదీన ఈనెల 4వ తేదీన విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెయిల్‌లో కోరారు. అయితే తాను మెయిల్ చేసుకోలేదని మాజీ మంత్రి చెప్పడంతో.. తిరిగి నిన్న నోటీసులు పంపించారు. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనగా.. అంబటి రాంబాబు కూడా విచారణ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save