పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో జాప్యం ఆలస్యంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఎలక్షన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ సంబంధించి తాళాలు కనిపించకపోవడానికి కారణంగా గంటన్నరపైగా లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైంది. దీనికి సంబంధించిన ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న మేనేజర్ ఈశ్వరరావు, టీపీఎస్ సత్యనారాయణ అనే ఇద్దరు ఆఫీసర్లను ఎన్నికల అధికారులు సస్పెండ్ చేశారు.