Global Vaartha
Date of Publish : 03/11/2026, 10:51 am
Editor : భవ్య జర్నలిస్ట్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.

దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికోసం పంచాయతీరాజ్ శాఖ, సీఈఎస్ఎల్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి.

న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఈ ఒప్పందం ద్వారా, పంచాయతీల ఖాళీ భూముల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

దీనివల్ల పంచాయతీలకు అదనపు ఆదాయం లభించడంతో పాటు, పెట్రోల్, డీజిల్పై ఆధారపడటం తగ్గుతుంది.

ప్రస్తుతం దేశంలో 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఉండగా, ఈ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమేలక్ష్యమని కేంద్రం తెలిపింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save