Global Vaartha
Date of Publish : 03/11/2026, 11:20 am
Editor : భవ్య జర్నలిస్ట్

టీటీడీ ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగింపు!!*

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగియడంతో AP ప్రభుత్వం తాత్కాలిక అథారిటీని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు జీవో నంబర్ 658 జారీ చేస్తూ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర (IAS)ను చైర్మన్ గా నియమించింది.

ఆర్థిక శాఖ కార్య దర్శి వి. వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబును సభ్యులుగా నియమించింది.

కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు ఈ అథారిటీ కొనసాగనుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save