విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ ఏజెంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 'e-Migrate' పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ పోర్టల్‌లో 2,300కు పైగా యాక్టివ్ రిక్రూటింగ్ ఏజెంట్ల వివరాలు ఉన్నాయి.
అభ్యర్థులు ఏజెంట్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేసి, అది చెల్లుబాటులో ఉందో లేదో వెంటనే ధ్రువీకరించుకోవచ్చు.
విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లేవారు ఏజెంట్ వివరాలను ముందుగానే తనిఖీ చేసుకోవచ్చు.