Global Vaartha
Date of Publish : 03/11/2026, 12:28 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జీడిమామిడి చెట్లు కనుమరుగు

  • వందల ఎకరాల్లో తోటలు నరికివేత..
  • చిత్తాపూర్‌ ఫేమస్‌...
  • గింజ.. పండు.. పిప్పి.. అన్నీ పనికొచ్చేవే..
  • ప్రాసెసింగ్‌ విధానం తెలియక నష్టం..

నెన్నెల(మంచిర్యాల): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాజు తోటలు కనుమరుగవుతున్నాయి. నాలుగు దశా బ్ధాల కిందటి నుంచే జీడిమామిడిని జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. కానీ కాజు ప్రాసెసింగ్‌ విధానం తెలియక మరోవైపు జీడి (కాజు)గింజల మార్కె టింగ్‌పై అవగాహన లేక నష్టపోయారు. ఇక్క డి రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసు కొని పట్టణ ప్రాంత వ్యాపారులు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలు గడించారు. కానీ సాగు చేసిన రైతులు మాత్రం నష్టాలను మూ టగట్టుకున్నారు. తోటలు ముదిరి కొన్ని సంవత్సరాలుగా దిగుబడి రాక పోతుండటంతో నిర్వహన రైతులకు భారంగా మారింది. నష్టాల్లో కూ రుకుపోయిన రైతులు కాజు చెట్లను నరికేస్తున్నారు. అక్కడక్కడ తప్ప కాజు చెట్లు కానరావడం లేదు. జాతీయ, అంతర్జాతీయ డ్రైఫ్రూట్స్‌ మార్కె ట్లో మంచి డిమాండ్‌ ఉన్న కాజును పండించే తోటలు ఇక గత వైభవంగా మిగిలిపోనున్నాయి.

చిత్తాపూర్‌ ఫేమస్‌...

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నెన్నెల మండలం చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్‌.వీ. రాజిరెడ్డి అనే భూస్వామి ఇక్కడి భూములు మామిడి, జీడిమా మిడి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించి వందల ఎకరాల్లో తోటలు నాటారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న పరిసర గ్రామాల రైతులు సైతం జీడి మామిడి, మామిడి తోటల పెంపకం చేపట్టారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో బెల్లంపల్లి, భీమారంలో నర్సరీలు ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాల గిరిజనులకు మామిడి, జీడి మామిడి మొక్కలను ఉచితంగా అందజేశారు. ఎరువు లు, మందులు అందజేసి, బోర్లు వేసి తోటల పెం పకాన్ని ప్రొత్సహించారు. గతంలో జిల్లాలో దాదాపు నాలుగు వేల ఎకరాల వరకు ఉన్న సాగు విస్తీర్ణం రానురాను పూర్తిగా తగ్గిపోతోంది. చిత్తాపూర్‌లోనే రెం డు వందల ఎకరాల వరకు జీడితోటలు ఉండేవి. భూ స్వాముల భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఆ భూముల్లో కాజు తోటలను తొలగించి పత్తి సాగు చేస్తున్నారు.

ప్రాసెసింగ్‌ విధానం తెలియక నష్టం..

మొదట్లో జీడి గింజల నుంచి కాజు పలుకులు తయారు చేసే ప్రాసెసింగ్‌ విధానం తెలియక కొన్నాళ్లు రైతులు నష్ట పోయారు. అప్పట్లో మార్కెట్లో కాజుకు ఉన్న డిమాండ్‌ తెలియక మధ్య దళారులకు అతి తక్కువ ధరకు పచ్చి గింజలు అమ్ముకు న్నారు. తీరా యా జమాన్య పద్దతులు, ప్రాసెసింగ్‌ విధానం, మార్కెట్‌ మెలుకువలు తెలుసుకునే సరికి చెట్లు ముదిరి కాత కాయడం మానేశాయి. యేటికేడు చెట్లల్లో బలంతగ్గి పూతకు రావడమే మానేశాయని రైతులంటున్నారు. ఇలా ఎన్నాళ్లని చూస్తామని వాటిని తొలగించి ఇతర పంట పండిచుకునేందుకు చెట్లు నరికి వేస్తున్నామని చె బుతున్నారు. జీడి మామిడి తోటల్లో ఇతర అంతర పం టలు వేసే వీలు లేక పోవడంతో భూమి ఉండి కూడా లాభం లేకుండా పోతోందని పేర్కొంటున్నారు. చెట్లు తొలగించి చదును చేసిన భూమిని పత్తి పంటకు కౌలుకు ఇస్తే ఎకరానికి రూ.20 వేల వరకు కౌలు వస్తుందని రైతులు పేర్కొన్నారు. మిగిలి ఉన్న తోటల ను టాప్‌ వర్కింగ్‌తో పునరుద్దరించే వీలుంది. అధికా రులు ఆ దిశగా కృషి చేస్తే జీడి తోటలు మళ్లీ జీవం పోసుకుంటాయి.

గింజ.. పండు.. పిప్పి.. అన్నీ పనికొచ్చేవే..

జీడిమామిడి కాయకు కింది భాగంలో గింజ ఉంటుంది. పక్వానికి వచ్చిన పండు నుంచి గింజను వేరు చేస్తారు. నూనె (జీడీ)తో నిండి ఉండే గింజను ప్రాసెస్‌ చేస్తేనే తెల్లని కాజు తయారవుతుంది. జీడి పప్పునకు ఎంత క్రేజ్‌ ఉందో డ్రైఫూట్స్‌ తినే వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ మార్కె ట్లో కాజుకు మంచి డిమాండ్‌ ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save