Global Vaartha
Date of Publish : 03/11/2026, 12:44 pm
Editor : భవ్య జర్నలిస్ట్

14 మందితో వెళ్తున్న నౌకపై ఒమన్‌లో దాడి.. భారతీయ నావికుడి మృతి

ఇంటర్నెట్ డెస్క్: ఒమన్‌ సముద్ర తీరంలో 14 మంది సిబ్బందితో వెళ్తున్న నౌకపై దాడి జరగడంతో ఓ భారతీయ నావికుడు చనిపోయారు. ఈనెల 2న ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని వస్తువు నౌకను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 13 మందిని ఒమన్ నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. మ‌ృతుడిని గుజరాత్‌కు చెందిన గంధార్ నహీం అజీజ్‌గా గుర్తించారు. దాడి జరిగిన నౌక భారతీయ పతాకంతో ఉందని, దానిని మోటరైజ్డ్ సెయిలింగ్ వెస్సెల్ (ఎంఎస్‌వీ) గుర్తించామని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్‌లో తెలిపారు. నౌకపై దాడి జరిగిన తర్వాత అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడని, కాసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుడి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.ఇక ప్రాణాలతో బతికి బయటపడిన 13 మందితో పాటు అజీజ్ డెడ్‌బాడీని కూడా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ విషయంపై ఒమన్‌లోని భారతీయ ఎంబసీతో పాటు విదేశాంగ శాఖ అధికారులు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నారని సోనోవాల్ తెలిపారు. మరోవైపు నౌకపై దాడిని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 22 మంది భారతీయులు చనిపోయారని తెలిపింది. వారిలో 14 మంది నావికులు ఉన్నారని వెల్లడించింది. కాగా.. ఈ ఏడాది మే నెలలో కూడా ఒక భారతీయ నౌకపై ఒమన్‌లో దాడి జరిగింది. దీంతో అది సముద్రంలో మునిగిపోయింది

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save