Global Vaartha
Date of Publish : 03/11/2026, 1:07 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాప్తాడు బాధితురాలు ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్య శాఖామంత్రి

అమరావతి : రాప్తాడులో ఉన్మాది ఘాతుకానికి తీవ్ర గాయాలపాలైన బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.‘రాప్తాడు ఉన్మాది బాధితురాలు మాట్లాడుతోందని.. వెంటిలేటర్‌ తొలగించామని వైద్యులు తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. శస్త్రచికిత్స.. అనంతరం వైద్యులు వెంటిలేటర్‌ తొలగించారు. వైద్యుల పిలుపునకు స్పందిస్తోందని.. ఒక్కో పదం మాట్లాడుతోందని తెలిపారు. దీంతో ఐసీయూలో హైఫ్లో ఆక్సిజన్‌ సాయాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ముక్కు ద్వారా ఆహారాన్ని సజావుగా స్వీకరిస్తోందని. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. బాధితురాలు రక్తహీనతతో బాధపడుతున్న కారణంగా రక్తమార్పిడి చేసినట్లు వైద్యులు తెలిపారు. అవయవాల కదలికలు, ఛాతీ వ్యాయామాల కోసం ఫిజియోథెరపీ చేస్తామన్నారు. యాంటీబయాటిక్స్‌, నొప్పి నివారణ మందులతో పాటు ఇతర సహాయక చికిత్సలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా..’ అని మంత్రి పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save