Global Vaartha
Date of Publish : 03/11/2026, 1:57 pm
Editor : భవ్య జర్నలిస్ట్

*నేడు డీఎస్సీ పూర్తి స్థాయి నోటిఫికేషన్ *

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మంగళవారం పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే సంక్షిప్త (షార్ట్) నోటిఫికేషన్ వెలువడగా, అర్హతలు, సిలబస్ వంటి సమగ్ర వివరాలతో కూడిన పూర్తి ప్రకటన ఇప్పుడు రానుంది.

▪️ మొత్తం పోస్టులు: 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు.

▪️ క్రీడా కోటా నియామకాలు: క్రీడా కోటా పోస్టులను కూడా ఈసారి జనరల్ పోస్టులతో కలిపే భర్తీ చేస్తారు. గతంలో మాదిరిగా హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు, క్రీడా కోటా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష నిర్వహిస్తారు.

▪️*దరఖాస్తుల ప్రక్రియ:* షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా, పూర్తి వివరాల ప్రక్రియ దృష్ట్యా నేడు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు.

✳️*పోస్టుల వారీగా వివరాలు:*

▪️ స్కూల్ అసిస్టెంట్ (జనరల్): 931

▪️ స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్): 255

▪️ ఎస్జీటీ (SGT - జనరల్): 1,231

▪️ ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్): 304

▪️ వయోజన విద్య: 4

▪️ గ్రంథాలయాలు: 100

▪️ డైట్ (DIET), ఎస్సీఈఆర్టీ (SCERT): 174

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save