మచిలీపట్నం : మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. కృష్ణాజిల్లా పెడన మున్సిపల్ చైర్మన్‌గా జనసేన పార్టీ అభ్యర్థి బళ్ళ జ్యోత్స్నరాణి ఘన విజయం సాధించారు. ఆమె సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 4,380 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు కలిసి పోటీ చేశాయి. పెడన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బళ్ళ జ్యోత్స్నరాణి బరిలో నిలిచి.. గెలుపొందారు.