ఇంటర్నెట్ డెస్క్: నిరసనకారుల ఆందోళనల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఢిల్లీలోని వ్యాపార సంఘాల వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. ఆందోళనలను నిర్వహించేవారిని ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీలో సుదీర్ఘ నిరసనలపై కేంద్ర ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది నిరసనల వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని.. పండుగల సీజన్‌లో ఆందోళనల వల్ల కన్నాట్ ప్లేస్ (CP) వ్యాపారాలు దెబ్బతిన్నాయని.. 50 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వ్యాపారాల సంఘాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి. కాగా.. పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసనకారులను, ఆందోళన నిర్వహించే వారిని పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని.. వారి పేర్లను కూడా పిటిషన్‌లో చేర్చాలని సూచించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రాథమిక హక్కుల పేరుతో నిరసన ప్రాంతాలను.. నిరవధికంగా ఒక్కరే ఆక్రమించలేరు. ఇతరుల ఆవేదననూ గుర్తించాలి. సమాజంలో ఇతరులకు కూడా.. తమ సమస్యలపై గళమెత్తే హక్కు ఉంటుందని గుర్తించాలి’ అని వ్యాఖ్యానించింది. కాగా.. మాస్ డిటెన్షన్లు, పోలీసు బలప్రయోగాలు, మెట్రో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారణ చేసిం