Global Vaartha
Date of Publish : 03/11/2026, 3:33 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆత్మకూరు మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం.. ఆ పార్టీ అభ్యర్థికి 2,206 ఓట్ల మెజారిటీ

నెల్లూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికి పూర్తయింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా.. ఒక వార్డులో టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అలాగే, ఎన్నికల్లో మరో 11 వార్డులను కైవసం చేసుకుంది. కూటమి పార్టీలైన బీజేపీ 1, జనసేన 3 స్థానాల్లో విజయం సాధించాయి. కూటమి ప్రత్యర్థి వైసీపీ మాత్రం కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డును గెలుచుకోగా.. సీపీఎం మరో స్థానాన్ని కైవసం చేసుకుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save