చిత్తూరు : ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 32 వార్డుల్లోనూ తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపొందారు. అన్ని వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. కుప్పంలో వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కని పరిస్థితి. కుప్పంలో టీడీపీ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.