Global Vaartha
Date of Publish : 03/11/2026, 5:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఉయ్యూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం.. శ్రేణుల సంబరాలు

కృష్ణాజిల్లా (కంకిపాడు) : ఉయ్యూరు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ గెలుపుపై ఉయ్యూరులో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. టీడీపీ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. స్వీట్స్ పంచుతూ శుభాకాంక్షలు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడారు.2024 జనరల్ ఎలక్షన్ల కన్నా అతిపెద్ద విజయాన్ని ఉయ్యూరు మున్సిపాలిటీ అందించిందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల అప్పుడు ఏదైతే చెప్పామో టిడ్కో గృహాలు కృష్ణానది నీళ్లు త్వరలోనే ఉయ్యూరు ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. 98% స్ట్రైక్ రేట్ ఇచ్చిన ఉయ్యూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల నుంచి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి విశ్వాసం ఉంచి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని అన్నారు.

ముందే చెప్పిన విధంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న తాడిగడప, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో ఒకటి గెలిచిన రాజీనామా చేస్తానన్నానని అన్నానని, కనీసం తన సవాల్‌ను వైసీపీ ఇన్‌ఛార్జ్ చక్రవర్తి స్వీకరించలేదంటే .. ఓటమిని ముందే అంగీకరించాడని అర్థమవుతుందని అన్నారు. ప్రతిపక్షాలకు ఉయ్యూరు మున్సిపాలిటీతో ట్రైలర్ చూపించామని.. తాడిగడప మున్సిపాలిటీతో పూర్తి సినిమా చూపిస్తామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పష్టం చేశారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save