Global Vaartha
Date of Publish : 21/10/2026, 2:28 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం...

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ...

1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 10 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణం పొందారని గుర్తుచేశారు. వారి త్యాగాలకు నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సహాయం అందించడంతో పాటు, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను ప్రజలకు తెలియజేసేందుకు అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

 ఈ సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save