Global Vaartha
Date of Publish : 03/11/2026, 5:47 pm
Editor : భవ్య జర్నలిస్ట్

విషాదం: గోల్‌కీపర్‌ను ఢీకొని.. ఫుట్‌బాలర్‌ మృతి

స్పోర్ట్స్ డెస్క్: స్పెయిన్‌(Spain)ఫుట్‌బాల్‌ తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా ఫుట్‌బాల్‌ క్లబ్‌ జరిగిన మ్యాచ్‌లో గోల్‌కీపర్‌ను బలంగా ఢీకొని ఓ 30 ఏళ్ల ఫుట్‌బాలర్‌ మరణించాడు. సీడీ టెనెరిఫ్‌, ఎఫ్‌సీ ఆండోరా క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్పెయిన్‌‌లోని ఎస్టాడియో మైదానంలో సోమవారం ఈ మ్యాచ్‌ జరిగింది.ఇరు జట్లు 2-2 స్కోర్‌తో సమానంగా ఉన్నప్పుడు టెనెరిఫ్‌ క్లబ్‌‌కు ప్రాతినిథ్యం జీసస్‌ డి మిగెల్‌(Spain Footballer) అనే 30 ఏళ్ల ప్లేయర్ బంతిని ఛేజ్‌ చేసుకుంటూ ముందుకొచ్చాడు. అదే సమయంలో గోల్‌ పోస్ట్‌ వద్ద ఉన్న ఆండోరా జట్టు గోల్‌ కీపర్‌ జీసస్‌ ఓనో బంతిని ఆపేందుకు పెనాల్టీ ఏరియా వద్దకు వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో మిగెల్‌ ఛాతీకి గోల్‌కీపర్‌ ఓనో మోకాలు బలంగా తగిలింది. దీంతో మిగెల్‌ నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలోనే కుప్పకూలాడు.

ఆ వెంటనే కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌కు గురికావడంతో... వైద్య సిబ్బంది సీపీఆర్‌ చేసింది. దాదాపు 5 నిమిషాల తర్వాత మిగెల్‌కు పల్స్‌ అందింది. వెంటనే అంబులెన్స్‌లో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం మిగెల్‌ మరణించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టెనెరిఫ్‌ క్లబ్‌ సంతాపం ప్రకటించింది. 2015లో సీనియర్‌ ఫుట్‌బాల్‌ కెరీర్‌ను ప్రారంభించిన మిగెల్‌.. పలు క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాదే టెనెరిఫ్‌ క్లబ్‌లో చేరాడు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save